అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

ఎడ్మండ్ థామస్ క్లింట్


ఎడ్మండ్ థామస్ క్లింట్ కేరళ, కొచ్చిన్కు చెందిన శ్రీ ఎమ్.టి. జోసఫ్ మరియు చిన్నమ్మ జోసఫ్ యొక్క ఏకైక కుమారుడు. మూత్రపిండాలు దెబ్బతినడంతో దీర్ఘకాలిక అస్వస్థత వల్ల అతడి జీవితం కేవలం 2522 రోజులకు మాత్రమే పరిమితమైంది. అయితే అతడు చాలా చిన్న వయస్సులోనే డ్రాయింగ్ మరియు పెయింటిం‌గ్‌ల్లో అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

క్లింట్ తాను చూసిన ప్రపంచాన్ని వివరించేు డ్రాయింగ్‌లు మరియు పెయింటింగ్‌లు సృష్టించడానికి చాక్, క్రేయాన్‌లు, ఆయిల్ పెయింట్‌లు మరియు వాటర్ కలర్స్‌తో సహా ప్రతిమాధ్యమాన్ని ఉపయోగించుకున్నాడు; అతడి సేకరణలోని పరిపక్వత అభిమానులు మరియు విమర్శలను ఆశ్చర్యపరిచింది, అతడిని ఒక కళాత్మక మేధావిగా వారు గుర్తించేలా చేసింది.

తన ఏడో పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక నెల ముందు క్లింట్ తన అపారమైన కళానిధిని అందించి, ఈ లోకాన్ని వీడాడు. ప్రజలు ఏవిధంగా భావిస్తారు అనే దానిని అర్ధం చేసుకునేందుకు అతడికి ఒక ప్రత్యేక సామర్ధ్యం ఉంది. ఈ శక్తివంతమైన భావోద్వేగాల నుంచి స్ఫూర్తిని పొంది చిత్రాలను గీశాడు. అంత చిన్నవయస్సులోనే, క్లింట్, మరణం, మోక్షం మరియు ప్రేమ వంటి లోతైన భావనల గురించి క్లింట్ కళారూపాలను చిత్రీకరించాడు. కళాకారుడు మాత్రమే కాకుండా, విస్త్రృతంగా చదివాడు. అతడు మహాభారతం మరియు రామాయణం వంటి పురాణగాధలను గీశాడు, అలానే రాబిన్సన్ క్రూసో వంటి సాహోససోపేత కథలను వినడానికి ఆసక్తి కనపరిచేవాడు. ఈ కథల్లో వివరించే ప్రతి సూక్ష్మ వివరాలను గ్రహించి, తన కళ ద్వారా వ్యక్తీకరించేవాడు.

Girls picking flowers
Kathakali
Raavanan
Pooram
Snake Boat
Theyyam
Sunset
Kavadi Festival
Village Temple Festival

క్లింట్ తండ్రి, హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్వుడ్ , యొక్క అభిమాని, దాంతో తన కుమారుడికి ఈ నటుడు పేరు పెట్టాడు. క్లింట్ మరణించిన తరువాత, భారతదేశానికి చెందిన ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ తయారీదారుడు శివకుమార్,ఈ యువ కళాకారుడు మరియు అతడి పనికి సంబంధించి ఒక డాక్యుమెంటరీని రూపొందించాడు. ఈ ఫిల్మ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది మరియు బ్రెజిల్‌లో క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈ డాక్యుమెంటరీని చూశాడు. క్లింట్ కథను ఎంతో కదిలిపోయిన ఈ నటుడు, క్లింట్ కుటుంబసభ్యులకు తన సంతాప సందేశాన్ని పంపుతూ, ఆ పిల్లవాడు అంత చిన్నవయస్సులోనే మరణించినందుకు విషాదం వ్యక్తం చేశారు.