అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

నియమాలు మరియు నిబంధనలు


 1. ఆన్‌లైన్ పెయింటింగ్ పోటీ ప్రపంచచవ్యాపత్ంగా ఉన్న అన్ని దేశాల్లోని పిల్లల కొరకు తెరవబడింది. నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు (01.09.2002 నాడు లేదా ఆ తరువాత మరియు 01.09.2014 నాడు లేదా ఆలోపు జన్మించినవారు) ఈ పోటీలో పాల్పంచుకోవచ్చు. వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన రక్షకులు ఇంగ్లిష్ భాషలో లేదా వారు ఎంచుకున్న భాషా ఇంటర్‌ప్రెటీటర్ యొక్క మద్దతుతో ఇక్కడ ప్రచురించబడ్డ పోటీ యొక్క నియమనిబంధనలను చదివి, అర్ధం చేసుకొని, ఆమోదించాలి.
 2. భారత ప్రభుత్వం యొక్క అన్ని చట్టాలు కూడా ఈ పోటీకి వర్తించబడతాయి.
 3. దరఖాస్తుని దాఖలు చేయడం ద్వారా, ప్రవేశదారుడు మరియు అతడి/ఆమె తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు పోటీ యొక్క అన్ని నియమనిబంధనలను ఆమోదిస్తున్నారు..
 4. ఎలాంటి ప్రత్యేక కారణాలను పేర్కొనకుండానే కేరళ టూరిజం పోటీ నియమనిబంధనలను పూర్తిగా లేుదా పాక్షకింగా మార్చేందుకు లేదా పోటీని పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేసే హక్కు దఖలు పడి ఉంటుంది.
 5. ఈ పోటీకి సంబంధించి లేదా దీని ఫలితంగా ఉత్పన్నమయ్యే ఏవైనా వివాదాన్ని నిర్ణయించడానికి మరియు/లేదా సెటిల్ చేయడానికి సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వానికి తుది అధికారం ఉంటుంది, మరియు సెక్రటరీ యొక్క నిర్ణయం తుది మరియు అన్ని సందర్భాల్లో దానిని అప్పీల్ చేయలేరు.
 6. ఈ పోటీలోని ప్రవేశదారులు కేరళకు సంబంధించిన ఏదైనా భావనను పేపర్‌పై చిత్రీకరించాల్సి ఉంటుంది. అతడు/ఆమె రిఫరెన్స్ కొరకుు కేరళపై లభ్యమవుతున్న ఫోటోలు మరియు వీడియోలను రిఫర్ చేయవచ్చు. పెయింటింగ్ యొక్క స్కాన్ చేయబడ్డ కాపీని ఆన్‌లైన్ సబ్మిషన్ విధానం ఉపయోగించి కేరళ టూరిజం వెబ్‌సైట్‌కు పంపాలి. ఒకవేళ కేరళ టూరిజం డిమాండ్ చేసినట్లయితే, ప్రవేశదారుడు ఒరిజినల్ పెయింటింగ్‌ని అతడి/ఆమె ఖర్చులతో పంపాల్సి ఉంటుంది.
 7. పబ్లిసిటీ లేదా ప్రమోషనల్ కార్యకలాపాల్లో పోటీలో అందుకోబడ్డ ఎంట్రీలను ఉపయోగించుకునేందుకు కేరళ టురిజంకు తిరుగులేని హక్కులుంటాయి.
 8. పోటీకి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్‌లు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి.

సవిస్తరమైన నియమనిబంధనలు చూడండి.

పోటీ షెడ్యూల్


 1. ఈ పోటీ కొరకు సెప్టెంబర్ 1, 2018 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ ధృవీకరించబడిన తరువాత వెంటనే ఎంట్రీలను దాఖలు చేయవచ్చు.
 2. 31, జనవరి 2019 వరకు ఎంట్రీలను సబ్మిట్ చేయవచ్చు.
 3. కమిటీ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన 2000 చిత్రాలు 31 మార్చి 2019 నాడు ప్రదర్శించబడతాయి.
 4. 2 మే 2019 లోగా విజేతలు ప్రకటించబడతారు.