Trade Media
     

కలరిపట్టు


కలరియపట్టు అనేది కేరళకు చెందిన మార్షల్‌ ఆర్ట్స్‌ రూపం, ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన మరియు సాంకేతికపరమైన మార్షల్‌ ఆర్ట్స్‌ రూపంగా పరిగణిస్తారు. కలరిలో యుద్ధకళల్లో శిక్షణ ఇస్తారు కలరి విద్యలో మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ ప్రారంభించడానికి ముందు శరీరాన్ని తయారు చేస్తారు. దీనికోసం శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేసి, శరీరం చురుగ్గా, మృదువుగా మారేట్లుగా చేస్తారు. చట్టం(దూకడం), వోట్టం(పరిగెత్తడం), మరిచిల్ ( పిల్లిమొగ్గలు వేయడం) మొదలైనవి ప్రాక్టీస్‌ చేస్తారు,తరువాత డ్రాగర్లు, కత్తులు, బాకులు, పిడులు, బాణం మరియు విల్లువంటి వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇస్తారు.

శరీరం మరియు మనస్సుల మధ్య అత్యుత్తమ సమన్వయం కల్పించడమే కలరియపట్టు శిక్షణ యొక్క ప్రధాన లక్ష్యం. సంప్రదాయ కలరి శిక్షణలో స్వతంత్రంగా వైద్య విధానాలను ఆచరించడంలోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. కలరీలు మతారాధాన కేంద్రాలు కూడా. కలిరిపట్టులో కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తరువాత ఆయిల్‌ మసాజ్‌ చేయించుకోవాలి. శరీరం ఒకే ఆకృతిలో ఉండటం కోసం రెగ్యులర్‌గా ఈ ఫీట్లను చేస్తూ ఉండాలి.


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia