Trade Media
     

బీకల్


లొకేషన్: బీకల్‌ ఫోర్టు నుంచి 1 కిలోమీటర్‌ దూరంలో, కాసరగోడ్‌ పట్టణానికి దక్షిణాన 16కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఉన్నది.

కేరళలోని ఉత్తర ప్రాంతంలో ఉండే కాసరగోడ్‌ జిల్లా గుళ్లు, కోటలు,నదులు, కొండలు మరియు అందమైన బీచ్‌లకు నెలవు. బీకల్‌, అతి పెద్ద మరియు అద్భుతంగా సంరక్షించబడుతోన్న ప్రముఖ కోట ఉన్నది. బీక్‌ ఫోర్టు దగ్గర ఉన్న షాలో బీచ్‌ను బీక్‌ ఫోర్ట్‌ బీచ్‌ అని అంటారు. బీకల్‌ ఫోర్టు బీచ్‌ను బీకల్‌ రిసార్ట్స్‌ డెవలప్‌మెంట్‌ రార్పొరేషన్‌(బిఆర్‌డిసి) అద్భుతంగా అభివృద్ధి చేసింది.

సుందరీకరణ: బీచ్‌లోనిలాటరైట్‌ను ఉపయోగించి రెండు తీయ్యం శిల్పాలను మరియు నిలంబర్‌కు చెందిన కళాకారుల మురల్‌ పేయింట్స్‌తో గోడలను సుందరీకరించడం ఉంటాయి. దీనితోపాటు పార్కింగ్‌ ప్రాంతంలో రాక్‌ గార్డెన్‌ నిర్మించబడిరది.ఇందులో వివిధ సైజుల్లో ఉన్న లాటరైట్‌ రాళ్లు ఉపయోగించుకోబడ్డాయి. సామాజిక అటవీ పథకం కింద, బీచ్‌ ప్రాంతంలో చెట్టు నాటబడ్డాయి.

పార్కింగ్‌ సదుపాయాలు: బిఆర్‌డిసి విభిన్న రకాల వాహనాల యొక్క పార్కింగ్‌ కొరకు 7000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది.

నడవడం: అద్భుతమైన తీరప్రాంతం మరియు బీకల్‌ ఫోర్టు యొక్క అందాలను చూడటం కోసం, టూరిస్టుల కొరకు, అందమైన వాక్‌వేను రూపొందించారు.

ప్రకాశవంతంగా ఉండే బీచ్‌: సాయంత్రం సమయాల్లో బీచ్‌లో ప్రకాశవంతమైన దీపాలు వెలుగుతాయి, తద్వారా పర్యాటకులు సూర్యాస్తమయం తరువాత కూడా ఎక్కువ సమయం బీచ్‌లో గడిపేందుకు అవకాశం లభిస్తుంది.

విశ్రాంతి సదుపాయాలు:: పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి సముద్ర గాలులను ఆస్వాదించడానికి మల్టీ షెడ్‌ మరియు ఎరుమడం తగిన సదుపాయాలను కల్పిస్తుంది. బీచ్‌లో స్థానికంగా లభించే మెటీరియల్స్‌ ఉపయోగించి సీటింగ్‌ సదుపాయాలు కల్పించారు.

టాయిలెట్స్‌:: పర్యాటకులు ఉపయోగించడం కోసం టాయిలెట్‌ కల్పించబడ్డాయి. బీచ్‌ పరిసర ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఎకో ఫ్రెండ్లీ వెదురు వేస్ట్‌ బిన్‌లను సమకూర్చారు.

పిల్లల పార్కు: 14 సంవత్సరాలలోపు పిల్లల కొరకు ఇక్కడ పార్కు అభివృద్ధి చేయబడింది.

నిర్వహణ నిమిత్తం ఎంట్రీ ఫీజు కింద ప్రతి సందర్శకుడి నుంచి కనీస రుసుం రూపాయి వసూలు చేస్తారు. ఇదేవిధంగా వాహన పార్కింగ్ రుసుం కూడా వసూలు చేస్తారు. బిఆర్‌డిసి బీచ్‌ పరిసరాల్లో ఉన్న మరో 11 ఎకరాల ప్రాంతంలో వాటర్‌ పార్కు, థీమ్‌ పార్కు మొదలైన వాటిని నిర్మించే లక్ష్యంగా పెట్టుకుంది.

బీకల్‌ను ఎకో ఫ్రెండ్లీ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు కేరళ ప్రభుత్వం బిఆర్‌డిసిని ఏర్పాటు చేసింది. బిఆర్‌డిసి సుమారు 25మిలియన్‌ రూపాయలను వ్యయం చేసి  19 ఎరాల భూమిలో బీక్‌ల్‌ ఫోర్టు బీచ్‌ను సుందరంగా అభివృద్ధి చేసింది.

అక్కడకు చేరుకోవడం:
  • దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: కాసరగోడ్, కోజికోడ్- మంగళూరు- ముంబై మార్గంలో
  • దగ్గరల్లో ఉన్న విమానాశ్రయం: మంగళూరు నగరం, కాసరగోడ్‌ పట్టణం నుంచి 50కిలోమీటర్ల దూరంలో ఉన్నది, అదేవిధంగా కారీపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, కోజికోడ్‌, కాసరగోడ్‌ పట్టణం నుంచి సుమారు 200కిలోమీటర్ల దూరంలో ఉంది.


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia