Trade Media
     

ఫోర్ట్ కొచ్చి


చరిత్రాత్మక నగరం ఫోర్ట్‌ కొచ్చిని ఆవిష్కృతం కావాలంటే తప్పకచూడాల్సింది ఆ నగరంలోని ఫోర్టు. రిలాక్స్‌, గట్టిగా శ్వాస తీసుకొని, కాటన్‌ డ్రస్సుల్లో, మృదువైన షూల్లో మరియు వెదరు టోపీని ధరించండి. ఈ ద్వీపంలోని ప్రతి అణువుకు కూడా ఒకచరిత్ర ఉన్నది. ఏదో ఒక అద్భుతమైనది మీ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటుంది.. ఇది దానికి స్వంతమైన ప్రపంచం, ఇది పురాతన కాలానికి ఉదాహరణలను ఇంకా గర్వంగా తనలో నిలుపుకున్నది.  ఒకవేళ మీరు గతాన్ని సృశించగలిగినట్లయితే, ఈ వీధుల్లో మీరు సంచరించడానికి ఏదీ అడ్డు చెప్పదు.

కె.జె.మార్షల్‌ రోడ్డులో నడుచుకుంటూ పోయి, ఎడమవైపుకు తిరిగినట్లయితే, మీరు ఫోర్ట్‌ ఇమాన్యువల్‌ యొక్క అందాలను చూడవచ్చు. ఈ కోట ఒకప్పుడు పోర్చుగీస్‌ వారికి చెందినది, ఇది అప్పటి కొచ్చిన్‌ మహారాజ మరియు పోర్చుగల్‌ యువరాజు మధ్య ఉన్న వ్యూహాత్మక ఒప్పందానికి గుర్తుగా ఈ కోటకు ఆపేరు పెట్టారు. ఈ పోర్టును 1503లో నిర్మించారు, అ తరువాత 1538ల తిరిగి పునరుద్ధరించారు. ఇంకాస్త ముందుకు వెళితే, మీరు డచ్‌ సిమెట్రీని చూడవచ్చు. 1724లో ప్రతిష్ఠించబడి, సౌత్‌ఇండియా చర్చి ద్వారా నిర్వహించబడుతోంది. ఇక్కడి సమాధి రాళ్లు తమ వసలరాజ్యాలను విస్తరించడం కోసం మాతృదేశాలను విడిచిపెట్టి ఇక్కడ వచ్చిన యూరోపియన్ల యొక్క జ్ఞాపకాలు సందర్శకులను మూగగా పలకరిస్తాయి.

తరువాత మీరు చూడాల్సింది టాకూర్‌ హౌస్‌. వలసకాలం నాటి కాంక్రీట్‌ నమూనాకు ప్రతిగా నిలుస్తుంది. ఈ భవంతి ఎంతో చూడచక్కనిది. ఇంతకు ముందు దీన్ని కునాల్‌ లేదా హిల్‌ బంగ్లా అని పిలిచేవారు, బ్రిటిష్‌ కాలంలో ఇది నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యొక్క మేనేజర్ల యొక్క కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు, ఇది ప్రముఖ టీ ట్రేడింగ్‌ కంపెనీ అయిన ఠాకూర్‌ అండ్‌ కంపెనీకి చెందినది.

ఇంకాస్త ముందుకు నడవండి, అక్కడమరో కాలనీ నిర్మాణం అయిన డేవిడ్‌ హాల్‌ మీ కోసం ఎదురు చూస్తుంది. దీన్ని 1695లో డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి నిర్మించింది. కేరళలోని పుష్పసంపదపై హోర్టస్‌ మలబారిస్‌ అనే పుస్తకాన్ని రాసిన డచ్‌ కమాండర్‌ హెంరడిక్‌ ఆండ్రియన్‌ వాన్‌ రీడ్‌ టోట్‌ డ్రెక్‌స్టన్‌కు సంబంధించిన హాల్‌ ఇది. అయితే, తరువాత ఈ హాల్‌లో నివసించిన డేవిడ్‌ కోడర్‌ పేరిట దీన్ని హాల్‌కు డేవిడ్‌ హాల్‌ అనే పేరు పెట్టారు.

పరేడ్‌ గ్రౌండ్‌ను దాటి ముందుకు సాగితే నాలుగు ఎకరాల గ్రౌండ్‌లో పోర్చుగీస్‌, డచ్‌ మరియు బ్రిటిష్‌ వారు ఒకప్పుడు మిలటరీ పరేడ్‌ చేసేవారు.ఆ తరువాత మీరు భారతదేశంలో అతి పురాతన యూరోపియన్‌ చర్చి అయిన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చికి చేరుకుంటారు. పోర్చుగీస్‌వారు 1503లో దీనిని నిర్మించిన తరువాత ఇది అనేక దశలను దాటుకున్నది. ప్రస్తుతం ఈ చర్చి, చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా వారి ఆధీనంలో ఉన్నది. ఈ చర్చిలోనే వాస్కోడిగామాను మొదట సమాధి చేశారు, ఆయన యొక్క సమాధిని మీరు గమనించవచ్చు.

చర్చి రోడ్డు నడవడానికి ఎంతో బాగుంటుంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే చల్లని గాలి మిమ్ముల్ని గిలిగింతలు పెడుతుంటుంది. సముద్రానికి కాస్తంత దగ్గరగా నడవండి, మీరు కొచ్చిన్‌ క్లబ్‌ను చూడవచ్చు, ఇది అతి పెద్ద లైబ్రరీతోపాటు స్పోర్టింగ్‌ ట్రోఫీలను కలిగి ఉన్నది. చక్కటి పార్కులో రూపొందించిన ఈ క్లబ్‌లో ఇప్పటికీ బ్రిటిష్‌ వాతావరణం కనిపిస్తుంది.

చర్చి రోడ్డుకు తిరిగి వెళ్లినట్లయితే, ఎడమ వైపు, మీ అతి పెద్ద మాన్షన్‌ను చూడవచ్చు, ఇదే బాస్టిన్‌ బంగ్లా. ఇండో యూరోపియన్‌ శైలిలో నిర్మించిన ఈ భవంతి ఒక అద్భుతం, దీన్ని 1667లో నిర్మించారు మరియు పాత డచ్‌ పోర్టు స్టోంబర్గ్‌ బాస్టిన్‌ సైటులో నిర్మించారు కనుక దీనికి ఆ పేరు పెట్టిరు. ఇప్పుడు ఇది సబ్‌ కలెక్టర్‌ యొక్క అధికారిక నివాసం.

దానికి దగ్గరల్లో వాస్కోడిగామా యొక్క స్క్వేర్‌ ఉంటుంది. ఒక ఇరుకైన విహార ప్రాంతం, కాస్తంత విశ్రాంతి పొందడానికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. సముద్ర ఆహారం మరియు కొబ్బరితో నిండిన అనేక స్టాల్స్‌ మిమ్ముల్ని ఊరిస్తుంటాయి. కాస్తంత ముందుకు సాగినట్లయితే మీరు చైనీస్‌ పిషింగ్‌ నెట్స్‌ను చూడవచ్చు. కుబాలీ ఖాన్‌ కోర్టు నుంచి 1350 మరియు 1450ల కాలంలో వచ్చిన వర్తకులు  ఈ నెట్‌లను ఏర్పాటు చేశారు.  

కాస్తంత విశ్రాంతిగా మీరు ముందుకు సాగినట్లయితే, మీరు పియర్సీ లెస్లీ బంగ్లాను చూడవచ్చు, ఇది ఒకప్పటి కాఫీ వ్యాపారులు అయిన పియర్సీ లెస్లీ అండ్‌ కో యొక్క ఆఫీసు. ఈ భవంతిలో పోర్చుగీస్‌, డచ్‌ మరియు లోకల్‌ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి.. దీని వాటర్‌ ఫ్రంట్‌ వరండాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. కుడివైపుకు తిరిగితే, మీరు పాత హార్బర్‌ హౌస్‌కు వస్తారు, దీన్ని 1808లో నిర్మించారు,ప్రముఖ టీ బ్రోకర్లు అయిన కారియట్‌ మారిన్‌ అండ్‌ కో నిర్మించింది. కోడార్‌ హౌస్‌కు దగ్గరల్లో, 1808సంవత్సరంలో కొచ్చిన్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ అయిన ఎస్‌.కోడర్‌ అడ్‌ కంపెనీ దీన్ని నిర్మించింది.. ఈ నిర్మాణం వలసదారుల నుంచి ఇండో యూరోపియన్‌ ఆర్కిటెక్చర్‌కు ఇది ఒక పరివర్తనంగా కనిపిస్తుంది.

ఇంకా కాస్తంత ముందుకు సాగినట్లయితే మీరు ప్రిన్సెస్‌ వీధిని చూస్తారు. ఇక్కడ ఉండే షాపులు చక్కటి తాజా పుష్పాలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో అతి పురాతమైన వీధుల్లో ఒది ఒకటి ఈ రోడ్డుకు ఇరువైపులా యూరోపియన్‌ స్టైల్‌లో ఉండే ఇల్లు కనిపిస్తాయి. కొచ్చిలోని వినోదాన్ని ఆస్వాదించాలని అనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన సంప్రదాయ లాఫర్స్‌ కార్నర్‌ ఈ వీధిలో ఉన్నది.

లాఫర్స్‌ వీధి నుంచి ఉత్తరానికి వెళ్లినట్లయితే మీరు శాంతా క్రూయిజ్‌ బసీలికాను చూస్తారు, దీన్ని పోర్చుగీస్‌ వారు నిర్మించారు. 1558లో పోప్‌ పాల్‌ నాలుగు ఈ దీన్ని కాథ్రడల్‌గా ప్రకటించారు. 1984లో, పోప్‌ జాన్‌ పాల్‌ 2 దీన్ని బెసీలికాగా ప్రకటించారు. బర్గర్‌ స్ట్రీట్‌ మరియు 1808లో నిర్మించి ఇప్పుడు హౌస్కూలుగా మారిన  డెల్టా స్టడీ వీధులను మీరు చూసిన తరువాత, మీరు ఇంకా ముందుకు నడిచినట్లయితే మీరు ప్రిన్స్‌ స్ట్రీట్‌లోకి మళ్లీ వస్తారు, అక్కడ నుంచి మీరు రోజ్‌ స్ట్రీట్‌లోకి వెళతారు. తరువాత మీరు వాస్కో హౌస్‌ను మీరు చేరుకుంటారు,. ఇది వాస్కోడిగామా యొక్క నివాసంగా భావిస్తారు. ఈ సంప్రదాయ మరియు అసాధారణ ఇల్లు కొచ్చిలోని ఉండే పోర్చుగీస్‌ నివాసాల్లో ఎంతో పురాతనమైనది..

ఎడమవైపుకు తిరిగినట్లయితే, మీరు రిడ్స్‌ డేల్‌ రోడ్డులోకి మీరు వెళతారు, అక్కడ మీరు వివోసి గేటును చూడవచ్చు. పరేడ్‌ గ్రౌండ్‌ వైపుకు ఉన్న అతి పెద్ద చెక్క గేటును మీరు చూడవచ్చు. ఈ గేటును 1740ల్లో నిర్మించారు, డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ యొక్క మోనోగ్రామ్‌(వివోసి)పేరిట ఈ గేటుకు ఆ పేరు వచ్చింది. దీనికి దగ్గరల్లో యునైటెడ్‌ క్లబ్‌ ఉంటుంది, ఇది కొచ్చిలో  ఒకప్పుడు ఉన్న నాలుగు ఎలైట్‌ క్లబ్‌ల్లో ఒకటి. ఇప్పుడు, దీన్ని పక్కనే ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ప్రైమరీ స్కూలు క్లాసురూమ్‌గా ఉపయోగిస్తున్నారు.

తిన్నగా నడిచినట్లయితే మీరు రోడ్డు యొక్క చివరకు చేరుకుంటారు, అదే బిషప్‌ నివాసం,దీన్ని 1506లో నిర్మించారు. ఇది ఒకప్పుడు పోర్చుగీస్‌ గవర్నర్‌ యొక్క నివాసంగా ఉండేది. దీన్ని పరేడ్‌ గ్రౌండ్స్‌కు దగ్గరల్లో ఉండే కొండపై నిర్మించారు. ఇంటి ముఖభాగానికి, గోతిక్‌ ఆర్చీలుంటాయి, ఈ బిల్డింగ్‌ను భారత్‌తోపాటు బర్మా,మలయ మరియు బర్మా వరకు అధికార పరిధిని విస్తరించిన కొచ్చిన్‌ డైయోసిస్‌కు చెందని 27వ బిషప్‌ డోమ్‌ జోస్‌ గోమ్స్‌ ఫెరీరీ ఈ బిల్డింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అవును, ఇప్పుడు ఇక నడకను ముగించే సమయం ఆసన్నమైంది. పురాతన రోజుల జ్ఞాపకాలు ఇంకా మీ మదిని ముప్పిరి కొంటున్నప్పుడు, అద్భుతమైన స్థలాలు మీ కంటి ముందు కదలాడుతున్నప్పుడు, రుచి కొరకు, మీ నోట్లో నీరు ఊరుతున్నప్పుడు, మళ్లీ ఒక్కసారి నడవాలని మీరు అనుకుంటారు.


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia