Trade Media
     

వాయనాడ్


వైశాల్యం: 2132 చదరపు కిలోమీటర్లు

జనాభా: 671, 195 (2001 జనాభాల లెక్కల ప్రకారం)

ఎత్తు: సముద్ర మట్టం నుంచి 700 - 2100మీటర్లు


పశ్చిమ కనుమల్లో 2,132 చదరపు కిలోమీటర్ల విస్తరించిన జీవ వైవిధ్య ప్రాంతమైన వాయినాడ్‌ జిల్లా కేరళజిల్లాల్లో ప్రకృతి అందాలకు ఆలవాలమైన జిల్లాగా  పేర్కొనవచ్చు. కొండల్లో ఉండే గిరిజన జాతులు వారు ఇంకా నాగరికతను చూడలేదు. అభికుంతిమల దగ్గరలోని ఎడుక్కల్ దగ్గరల్లో ప్రీ హిస్టారిక్ కాలానికి చెందిన అనేక ఆవిష్కరణను మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా మీసోలితిక్ కాలానికి చెందినవిగా గుర్తించారు. ఇది ఉప ఉష్ణమండల సవన్నాలతు, అందమైన హిల్ స్టేషన్లు, విశాలమైన సుగంధ ద్రవ్యాల తోటలు, విలాసవంతమైన అడవులు మరియు ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు ఇది నెలవు. నిర్జనత, చరిత్ర మరియు కల్చర్ యొక్క సంగమం ఇది,దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ కొనపై వాయనాడ్ ఉన్నది.
  • దగ్గరల్లో ఉన్న విమానాశ్రయం: కోజికోడ్
  • దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: కోజికోడ్
జిల్లాల్లోని ప్రధాన పట్టనాలు మరియు దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి దూరం:

  • కెలపట్టి: కోజికోడ్ నుంచి 72కిలోమీటర్లు
  • మనంతవాడీ: తలసెర్రీ నుంచి 80కి.మీ/ కోజికోడ్ నుంచి 106కి.మీ
  • సుల్తాన్ బతేరా: కోజికోడ్ నుంచి 97కిలోమీటర్లు
  • వైతేరీ కోజికోడ్ నుంచి 60కిలోమీటర్లు

రోడ్డు: కోజికోడ్‌, కన్నూర్‌, ఊటీ( కాల్‌పెట్టా నుంచి 175కిలోమీటర్లు మరియు మైసూరు(కాల్‌పెట్టా నుంచి 140కిలోమీటర్లు) నుంచి చక్కటి రోడ్డు మార్గాలున్నాయి.

చెంబ్రా పార్క్
2100 మీటర్ల ఎత్తు వద్ద, వాయనాడ్‌ దక్షిణ ప్రాంతంలో మెప్పాడి వద్ద అతి ఎత్తైన చంబా పర్వతశిఖం ఉన్నది. ఈ ప్రాంతంలో అన్నింటి కంటే ఎత్తైన శిఖరం ఇది మరియు ఈ శిఖరాన్నిఎక్కడం ఎంతో క్లిష్టమైన అంశం. చంబా పర్వతాన్ని ఎక్కడ నిజంగా ఒక మరపురాని అనుభవం, ప్రతి దశలోనూ వాయినాడ్‌ యొక్క అందాలు మన ముందు ఆవిష్కృతం అవుతాయి. శిఖరం పైకి వెళ్లి, కిందకు రావడానికి ఒక్కరోజు సమయం పడుతుంది. శిఖరంపై క్యాంప్‌ వేయాలనుకునేవారికి ఒక మరపురాని అనుభూతి మిగులుతుంది.

ఎవరైతే క్యాంప్‌ వేయాలని అనుకుంటారో, వారు వాయనాడ్‌లోని కెల్‌పెట్టాలో ఉన్న డిస్ట్రిక్ట్‌ టూరిజం ్పమోషన్‌ కౌన్సిల్‌ను సంప్రదించవచ్చు.

నీలిమల
వాయనాడ్‌లోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్నది, కెల్‌ పట్టా నుంచినే కాకుండా సుల్తాన్‌ బతేరే నుంచి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు, నీలమల ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైనది. ట్రెక్కింగ్‌కు వివిధ రకాల ట్రెక్కింగ్‌ మార్గాలను ఎంచుకోవచ్చు. నీలమల పై నుంచి మీన్‌ముట్టి జలపాతాలను చూడటం ఒక మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది.

మీన్ ముట్టి
నీలిమలపర్వతానికి అతి దగ్గరలో ఉన్న అద్భుతమైన మీన్‌ముట్టి జలపాతాలను ఊటీ మరియు వాయినాడ్‌ను కలిపే మెయిన్‌ రోడ్డు నుంచి 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయడం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. వాయనాడ్‌ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌, ఇక్కడ నీళ్లు సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి పడతాయి.

చీతాలయం
వాయనాడ్‌ జిల్లాలో సందర్శకులను ఆకర్షించే మరో జలపాతాలు చీతాలయం జలపాతాలు, వాయనాడ్‌కు ఉత్తర ప్రాంతంలో ఉండే సుల్తాన్‌ బతేరాకు దగ్గరగా ఉంటాయి. మీన్‌ముట్టితో పోలిస్తే ఈ జలపాతాలు ఎంతో చిన్నవి. ఈ ఫాల్స్‌ మరియు వీటి పరిసరాల్లో ఉండే ప్రాంతాలు ట్రెక్కింగ్‌కు మరియు పక్షులను సందర్శించేవారికి ఎంతో అనుకూలమైనవి.

పక్షిపథలం
పక్షిపతాలం అనేది సుమారు 1700మీటర్ల ఎత్తున బ్రహ్మగిరి హిల్స్‌లోని అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా పెద్దపెద్ద బండరాళ్లు ఉంటాయి, ఇవి నిజంగానే ఎంతో పెద్దవిగా ఉంటుంది. ఇక్కడ ఉండే లోతైన గుహలు వివిధ రకాల పక్షులు, జంతువులు మరియు అరుదైన మొక్కలకు కేంద్రం. పక్షిపతాలం మన్నన్‌తావడీకి దగ్గరల్లో ఉంటుంది మరియు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అడవిలో తిరువల్ల నుంచి సుమారు 7కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్‌ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. పక్షిపతాలానికి చేరుకునే సందర్శకులు డిఎఫ్‌వో ` ఉత్తర వాయనాడ్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

బనాసురా సాగర్‌ డ్యామ్‌
భారతదేశంలో అతి పెద్ద ఎర్త్‌ డ్యామ్‌గా ఇది పరిగణించబడుతుంది. ఈ డ్యామ్‌ వాయనాడ్‌లోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో కరలాడ్‌ సరస్సుకు దగ్గరగా ఉంది. బన్నాసురా సాగర్‌ డ్యామ్‌ యొక్క ప్రాజెక్ట్‌ ప్రాంతం, బన్నాసురా పర్వతశిఖరానికి ట్రెక్కింగ్‌ ప్రారంభ స్థానం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాలను ముంచివేయడం వల్ల కొన్ని దీవులు ఏర్పడ్డాయి.

వాయనాడ్‌ యొక్క స్థలాలు, ధ్వనులు మరియు సువాసనలు మదిలో నింపుకున్న తరువాత, మీరు వాయనాడ్‌లోని సుగంధ ద్రవ్యాలు, కాఫీ,టీ, వెదురు ఉత్పత్తులు, తేనె మరియు వనమూలికల మొక్కల్ని కొనుగోలు చేయవచ్చు.

వాయనాడ్‌లో ‘ అవుట్‌డోర్‌ ట్రయిల్‌’ మీద మరిన్ని వివరాల కోసం వాయనాడ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌కు టచ్‌లో ఉండండి.

చిరునామా:
ప్రధాన కార్యదర్శి
వాయనాడ్ టూరిజం సంస్థ
వాపుదేవ ఎడోమ్, పుళుతన పోస్టు,
వాయనాడ్, కేరళ
ఇండియా.
పిన్ – 673575
టెలిఫోన్: + 91 4936 255308, ఫ్యాక్స్: + 91 4936 227341
ఈ మెయిల్: mail@wayanad.org


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia