Trade Media
     

మున్నార్


దేశీయ మరియు విదేశీ పర్యాటకుల్లో ఒక పర్యాటన కేంద్రంగా కేరళ యొక్క పాపులారిటీ పెరగడానికి ఇవి ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇది ముత్తిరపుళా, నల్లతన్ని మరియు కుండాల అనే మూడు పర్వతాల సంగమంలో ఉన్నది. సముద్ర మట్టానికి 1600మీటర్ల ఎత్తులో ఉన్న మున్నార్‌ ఒకప్పుడు బ్రిటిష్‌ పరిపాలకులు దక్షిణ భారతదేశంలో వేసవి రిసార్ట్‌.

ఈ హిల్‌ స్టేషన్‌లో పెద్దమొత్తంలో టీ తోటలు, వలసకాలం నాటి బంగ్లాలు, సెలయేళ్లు, వాటర్‌ఫాల్స్‌ మరియు చల్లని వాతావరణం ఉంటుంది. ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ కు ఇది ఎంతో చక్కటి ప్రదేశం.

మున్నారు మరియు దాని చుట్టపక్కల ఉండే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను మనం ఇప్పుడు చూద్దాం. హిల్‌ స్టేషన్‌ మున్నారు చుట్టుపక్కల్లో అనేక ఆకర్షణమైన ప్రదేశాలున్నాయి.

ఎరివికులం నేషనల్‌ పార్క్‌
మున్నారు పక్కన ప్రధాన ఆకర్షణ ఎరివికులం నేషనల్‌ పార్క్‌ అని చెప్పవచ్చు. ఇది మున్నారు నుంచి 15కిలోమీటర్ల దూరంలో ఉన్నది, మరియు ఇది అంతరించిపోతున్న నీలగిరితార్‌కు ఫేమస్‌. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కు అనేక రకాల అరుదైన సీతాకోక చిలుకలు, జంతువు మరియు పక్షులకు కేంద్రం. ఇది ట్రెక్కింగ్‌కు గొప్పస్థలం, పార్కులో నుంచి టీతోలు, ఆపై తుషార బిందువుల దుప్పటిని కప్పుకున్న కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. నీల కురింజి పుష్పం ఈ పర్వత సానువుల్లో విరబూసినప్పుడు, పర్వతాలు నీలం దుప్పటి కప్పుకున్నట్లుగా ఉన్నప్పుడు, ఈ పర్వతం పర్యాటకులు ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తరలి వస్తారు.   పశ్చిమ కనుమలకు చెందిన ఈ పుష్పం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్పిస్తుంది. ఇది చివరిసారిగా 2006లో పూసింది.

అన్నముడి పర్వతశిఖరం
ఎరివికులం నేషనల్‌ పార్కులోపల ఉన్నది అన్నముడి పర్వతశిఖరం. దక్షిణ భారతదేశంలోనే ఇది అతి పెద్ద పర్వతశిఖరం, ఇది సుమారు 2700 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ పర్వతశిఖంపై ట్రెక్కింగ్‌ చేయడానికి ఫారెస్ట్‌ మరియు వన్య సంరక్షణ అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

మట్టుపెట్టి
మరో ఆసక్తికర ప్రదేశం, మున్నారు పట్టణం నుంచి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న ముట్టపట్టి. ఇది సముద్రమట్టానికి 1700మీటర్ల ఎత్తులో ఉన్నది,మట్టుపెట్టి స్టోరేజీ డ్యామ్‌ మరియు అందమైన చెరువు ఉన్నాయి. ఇందులో అద్భుతమైన బోటు రైడిరగ్‌కు అనుమతిస్తారు, పక్కన ఉన్న కొండలు మరియు లాండ్‌ స్కేప్‌లను ఆస్వాదించవచ్చు. మట్టుపుట్టిలో నడపబడే ఇండో స్విస్‌ లైవ్‌ స్టాక్‌ ప్రాజెక్ట్‌ కింద నడపబడే డైరీ ఫాం ఎంతో ప్రముఖమైనది, ఇక్కడ అత్యంత దిగుబడి ఇచ్చే ఆవుల్లో  చూడవచ్చు. మట్టుపెట్టి,పచ్చని టీ తోటలు, రోలింగ్‌ గ్రాస్‌ ల్యాండ్స్‌ మరియు షోలా అడవులతోపాటు ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైనది మరియు ఇది అనేక రకాల పక్షులకు కేంద్రం.

పల్లివాసల్
పల్లివాసల్‌, ఇది మున్నారు నుంచి చిత్తిరపురం నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది అద్భుతమైన దృశ్య సౌందర్యానికి కేంద్రం మరియు సందర్శకులు దీన్ని ఒక ప్రముఖ పిక్నిక్‌కేంద్రంగా పరిగణిస్తున్నారు.

చిన్నకనల్
మున్నారుకు దగ్గరల్లో చిన్నకన్నల్‌ ఉంటుంది మరియు ఇక్కడ ఉండే వాటర్‌ ఫాల్స్‌ను పవర్‌ హౌస్‌ వాటర్‌ ఫాల్స్‌ అని అంటారు. ఇక్కడ నిట్టనిలువుగా ఉండే రాళ్లు సముద్ర మట్టానికి 2000మీటర్ల ఎత్తుగా ఉంది. ఈ ప్రదేశం, పశ్చిమఘాట్‌ శ్రేణిలోని అందమైన దృశ్యాలకు కేంద్రంగా ఉంటుంది.

అనియరంగల్‌
చిన్నకనల్‌ నుంచి ఏడు కిలోమీటర్ల ప్రయాణిస్తే మీరు అనియరంగల్‌ చేరుకుంటారు. మున్నార్‌ నుంచి 22కిలోమీటర్ల దూరంలో ఉండే  అనియరంగల్‌, టీ తోటలతో పచ్చనికార్పెట్‌లా ఉంటుంది. అద్భుతమైన రిజర్వాయర్‌పై ట్రిప్పు ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది. అనియరంగల్‌ డ్యామ్‌ చుట్టుపక్కల టీ తోటలు మరియు పచ్చని అడవులుంటాయి.

హిల్‌ స్టేషన్‌
టాప్ స్టేషన్,మున్నారు నుంచి 3కిలోమీటర్ల దూరంలో  సముద్ర మట్టానికి 1700మీటర్ల ఎత్తులో ఉంటుంది. మున్నార్- కొడైకెనాల్ రోడ్డులో ఇది గరిష్ట స్థానం. మున్నారును సందర్శించే సందర్శకులు తప్పనిసరిగా టాప్‌ స్టేషన్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడ నుంచి పొరుగున్న తమిళనాడు రాష్ట్రం యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ఎంతో విశాలమైనప్రాంతంలో విరబూసే నీలకురింజి పుష్పాలను చూడటం కోసం మున్నారులో ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం.

టీ మ్యూజియం
టీ తోటల ఆవిర్భావం మరియు వృద్ధికి సంబంధించి మున్నారుకు ఘనమైన పూర్వ చరిత్రే ఉన్నది. ఈ పూర్వ చరిత్రను సంరక్షించడం కోసం మరియు కేరళ గరిష్ట ఎత్తుల్లో సాగించే టీ తోగల సాగులోని ఆసక్తికరమైన అంశాలను ప్రపంచవానికి తెలియచేయడం కోసం మున్నారులో టాటా టీ ద్వారా టీ కొరకు ప్రత్యేకమైన ఒక మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ టీ మ్యూజియంలో అనేక ఆసక్తికరమైన వస్తువులు, ఫోటోగ్రాఫ్‌లు మరియు యంత్రాలున్నాయి. ఇవీన్న కూడా మున్నారు ప్రాంతంలో టీ తోటల యొక్క అభివృద్ధికిసంబంధించి మనకు అనేక కథలు చెబుతాయి. మున్నారులోని టాటా టీకి చెందిన నల్లతాను ఎస్టేటులో ఉన్న ఈ మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే.

అక్కడకు చేరుకోవడం:
  • దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: తేని(తమిళనాడు) సుమరు 60కిలోమీటర్ల దూరంలో:, చెంగనచెర్రి,సుమారు 93కిలోమీటర్ల దూరంలో
  • దగ్గరల్లో ఉన్న విమానాశ్రయం: మదురై(తమిళనాడు) సుమరు 140కిలోమీటర్ల దూరంలో:, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పో్ర్టు, 190కిలోమీటర్ల దూరంలో


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia