Trade Media
     

తేక్కడి, ఇడుక్కి

ఎత్తు: సముద్ర మట్టం నుంచి 900 - 1800మీటర్లు

వర్షపాతం: 2500 మీమీ

తేక్కడి అనే పేరు వినిపించగానే మనకు ఏనుగులు,విడిపోయే కొండల వరసలు మరియు సుగంధ ద్రవ్యాల వాసనలు విరజిమ్మే తోటలు మనకు గుర్తుకు వస్తాయి. పెరియార్‌ అడవి, భారతదేశంలో ఉన్న అత్యుద్భుతమైన వన్య సంరక్షణ కేంద్రాల్లో ఒకటి, ఇది జిల్లా మొత్తం విస్తరించింది ఉంది. అందమైన తోటలు మరియు పర్వత పట్టణాలు , ట్రెక్కింగ్‌ మరియు మౌంటైన్‌ వాక్‌కు ఎంతో అనుకూలమైనవి.

రోడ్డు:
కుమిలి(4 కిలోమీటర్ల దూరంలో ఉన్న) నుంచి వివిధ టూరిస్టు ప్రాంతాలకు తరచుగా బస్సులు ఉంటాయి.

తెక్కడి నుంచి వివిధ ప్రధాన పట్టణాల  దూరం
  • కుమిలీ: 4 కిమీ (15నిమిషాలు) వయా శబరిమల
  • పులిమేడు: 50 కిమీ (2 గంటలు)
  • ఇడుక్కి: 65 కిమీ (2 1/2 గంటలు)
  • మున్నార్: 106 కిమీ (4 గంటలు)
  • కుమరకోమ్ 128 కిమీ (4 గంటలు) వయా శబరిమల
  • ఎరునలి: 134 కిమీ (4 గంటలు)
  • కొడైకెనాల్: 149 కిమీ (5 గంటలు)
  • అలప్పుర 164 కిమీ (5 గంటలు)
  • కొల్లం 220 కిమీ (6 గంటలు)
  • ఊటీ: 390 కిమీ (11 గంటలు)

కుమిలీ నుంచి బస్సు టైమింగ్స్:
  • తేక్కడి: 09:30, 10:45, 11:30, 12:00, 12:30, 13:30, 15:30 గంటలు
  • కుమరకోమ్ :(07:00 గంటలు)
  • మున్నార్: 06:00, 09:45, 13:30 గంటలు
  • ఎర్నాకులం: 07:00, 13:30, 15:15, 16:30,17:15, 19:30 గంటలు
  • తిరువనంతపురం( కుమిలీ నుంచి): 08:40, 15:30, 16:15 గంటలు(తేక్కడి నుంచి): 08:20, 15:15 గంటలు
  • కొట్టాయం: తరచుగా బస్సులు
  • అలప్పుర: (11:15 గంటలు)
  • చెర్తాల: 14:15 గంటలు
  • ఇడుక్కి: తరచుగా బస్సులు
  • చెన్నై: 16:30, 19:00 గంటలు
  • పాండిచెర్రి: (16:30 గంటలు)
  • మధురై: 01:15, 05:15, 05:25, 06:45, 07:16, 07:20, 07:30, 07:55, 08:35, 09:40, 10:30, 10:45, 11:20, 11:55, 13:00, 13:15, 13:20, 14:20, 15:15, 15:40, 15:50, 16:50, 17:05, 18:00, 18:40, 19:05, 20:45 గంటలు
  • దిండిగల్: తరచుగా బస్సులు
  • కొడైకెనాల్: కుమిలీ నుంచి కొడైకెనాల్ కు నేరుగా బస్సు లేదు దిండిగల్ బస్సు మిమ్మల్ని వత్తల గుండు వరకు తీసుకెళుతుంది, అక్కడ నుంచి కొడైకెనాల్ కు మీకు (149 కిమీ) బస్సులు ఉంటాయి.
  • తిరుచ్చి: 08:55, 10:45, 19:25 గంటలు వయా పళని 09:30, 11:35, 18:30 18:50 గంటలు వయా పళని

ఫ్లోరా:
మొత్తం 1965పుష్పించే మొక్కల్లో 171 గడ్డి రకాలు, 143 ఆర్కిడ్‌ రకాలు మరియు కేవలం దక్షిణ భారతదేశ కోనిఫెరస్‌ పోడోకార్పస్‌ వలిచైనస్‌లున్నాయి.

జంతు సంపద
క్షీరదాలు: 35 రకాల్లో ఏనుగులు ఘర్‌, సాంబార్‌ డీర్‌ మరియు అడవి ఎలుగుబంటలు వంటి జంతువులను దిగువ ప్రాంతాల్లో గమనిస్తే నీలగిరీ తార్‌ అనే అరుదైన జీవిని ఎక్కువ ఎత్తుగా ఉండే రాతి ప్రదేశాల్లోనూ అదేవిధంగా సింహం తోకతో ఉండే కోతులు, పచ్చగా ఉండే అడవుల లోపలి ప్రాంతాల్లో అదేవిధంగా మలాబార్‌ జెయింట్‌ ఉడతలు, ఎగిరే ఉడతలు, పులి, అడవి పిల్లి, స్లాత్‌ బేర్‌ వంటివి కనిపిస్తాయి.

పక్షులు : వలస వచ్చిన పక్షులతో సహా 265. హార్న్‌ బిల్‌, కొంగ, వడ్రంగిపిట్ట, చెకుముకి పిట్ట, రాఫ్టర్‌, నీటికాకి, గ్రాకెల్‌, డార్టర్‌ మొదలైనవి.

సరీసృపాలు : కోబ్రా, తాచుపాము, కట్లపాము, విషం లేని అనేక పాములు మరియు మానిటర్‌ బల్లి

ఉభయచరాలు: కప్పలు, గోదురులతోపాటు రంగురంగుల మలబార్‌ గ్లైడిరగ్‌ కప్ప, కామన్‌ ఇండియన్‌ చిరుకప్పు,ఫన్‌గోయిడ్‌ కప్ప మరియు రెండు రంగుల్లో ఉండే కప్ప

పైకస్‌(చేప): పెరియర్‌ వాగులు, వంకల్లో అనేకక రకాల జాతుల చేపలు కనిపిస్తాయి. ముషేర్‌, అదృశ్యమైపోతున్న భారతదేశ గేమ్‌ఫిష్‌ వంటివి ఉంటాయి. వోట్టర్‌: సరస్సుల్లో ఉండే ఏకైక క్షీరదం. బోట్లలో ప్రయాణించేటప్పుడు దీన్నిగమనించవచ్చు.

తోటలు, టీ, ఏలకులు, మిరియాలుచ కాఫీ తోటలు పెరియార్‌ వన్య సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్నాయి.

వన్యసంరక్షణ కేంద్రంలో సందర్శన టవర్లు: పెరియార్‌ అడవిలోపల రెండు రకాల వాచ్‌ టవర్లు ఉంటాయి. ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, తెక్కడిలో మీరు రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఫోన్: 322028.

అనుమతి అధికారి: వన్యప్రాణి సంరక్షణ అధికారి,పెరియార్ టైగర్ రిజర్వ్, తేక్కడి.


 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia