కేరళ తీరప్రాంతంలో ఒక మృదువైన అల పైకి లేచి, తనలో తాను లీనమైపోవడం కొత్త విషయమేమీ కాదు. అయినా ఆ అలల గుండా సాగిపోయే సర్ఫర్ విన్యాసం మిమ్మల్ని ఒక్క క్షణం ముగ్ధులను చేస్తుంది. ఇది ఇటీవలే మొదలై, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటూ, మెల్లగా ఈ తీర సౌందర్యంలో భాగమవుతోంది.
జనసమ్మర్ధంతో నిండిన ఇతర సర్ఫింగ్ స్థలాలతో పోలిస్తే, కేరళలోని చాలా బీచ్‌లు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. కొత్తగా నేర్చుకునేవారు తమకు నచ్చినట్లు నిదానంగా నేర్చుకోవచ్చు, అనుభవజ్ఞులైన సర్ఫర్లు అలలపై సుదీర్ఘమైన, నిరంతర ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. కొండ అంచున ఉండే తీరాలు, ప్రశాంతమైన నదీ ముఖద్వారాలతో ఇక్కడి తీరం వైవిధ్య భరితమైనది; ఇక్కడ ఇసుక నేలల కారణంగా, ముఖ్యంగా వర్షాకాలం తర్వాత వచ్చే నెలల్లో, అలలు మృదువుగా మరియు మరింత సులభంగా నియంత్రించగలిగేలా ఉంటాయి
అర్హులైన శిక్షకులు, ఫోమ్ బోర్డులు, సరైన పాఠాల వల్ల కొత్తగా వచ్చేవారు కూడా త్వరగా బ్యాలెన్స్ నేర్చుకుని, తమ మొదటి సర్ఫింగ్ ఆనందాన్ని అనుభవించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇందుకు సంబంధించిన శిక్షణ పాఠశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
ఎక్కువ శాతం సర్ఫింగ్ సంస్థలు వర్కల, కోవలం, ఉత్తర కేరళలోని కొన్ని సముద్రతీరాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాంతాలలో స్థిరమైన అలలు, అనుకూలమైన ప్రవేశ మార్గాలు, తగిన సంఖ్యలో సర్ఫింగ్ పాఠశాలలు మరియు కెఫేలు ఉండటం వల్ల సర్ఫర్ల సౌకర్యానికి, భద్రతకు పూర్తి హామీ లభిస్తుంది; ఇది ఒక ప్రశాంతమైన సర్ఫింగ్ పట్టణ వాతావరణాన్ని అందిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా క్లాసులు జరుగుతాయి, ఎందుకంటే అప్పుడు గాలి తక్కువగా ఉండి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఒకసారి చేసినా లేదా సర్ఫింగ్ క్యాంపులో చేరినా, భద్రత, క్రమబద్ధమైన శిక్షణ మరియు సముద్రం పట్ల ఆదరాభిమానాలు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి.
కేరళలో ముఖ్యమైన సర్ఫింగ్ కాలం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది, అంటే నైరుతి వర్షాకాలం తర్వాత అన్నమాట. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉండి సర్ఫింగ్‌కు వీలుగా ఉంటుంది, అలలు అంత ఎత్తుగా ఉండవు మరియు స్పష్టంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, బలమైన ప్రవాహాలు, అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాకాల నెలలు సర్ఫింగ్ శిక్షణకు అనుకూలమైనవి కావు. పేరున్న సర్ఫింగ్ స్కూళ్లు సర్టిఫైడ్ శిక్షకులతో నడుస్తాయి, క్లాసు కంటే ముందు భద్రతా నియమాలు చెప్తారు, పరికరాలు తనిఖీ చేస్తారు; దీనివల్ల ఈత రానివారు కూడా తక్కువ లోతు ఉన్న చోట సురక్షితంగా చేయవచ్చు.
చాలామంది నిర్వాహకులు ప్రారంభ స్థాయి 'లెర్న్ టు సర్ఫ్' సెషన్లను, కొన్ని రోజుల కోర్సులు, కొద్దిగా అనుభవం ఉన్నవారి కోసం గైడెడ్ సెషన్‌లు అందిస్తున్నారు శని, ఆదివారాలు, సెలవు రోజులు మరియు రద్దీ ఎక్కువగా ఉండే కాలంలో ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే, సుదీర్ఘ సెషన్లు లేదా క్యాంపుల విషయానికి వస్తే, మీ ప్రాథమిక శారీరక సామర్థ్యం మరియు వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి రావచ్చు. సముద్రం సురక్షితంగా ఉందని శిక్షకులు నిర్ధారించినప్పుడు మాత్రమే సర్ఫింగ్ సాగుతుంది. అలల తీవ్రత మరియు గాలిని బట్టి ఈ సమయాలు మారే అవకాశం ఉంది.
ముందుగా, మీ శిక్షకుడు ఫ్లాగ్ సిస్టమ్స్, బలమైన ప్రవాహాలు మరియు కింద పడేటప్పుడు దెబ్బలు తగలకుండా ఉండే మార్గాల గురించి చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మంచి శిక్షకులు, నాణ్యమైన పరికరాలు ఉండాలని అనుకుంటే, కేరళ టూరిజం అనుమతి లేదా గుర్తింపు ఉన్న సర్ఫింగ్ స్కూళ్లను మాత్రమే ఎంచుకోండి.
నీటిపై మీకున్న నమ్మకం, పూర్వపు సర్ఫింగ్ అనుభవాన్ని బట్టి మీరు ప్రాథమిక పాఠాలను లేదా ఉన్నత స్థాయి శిక్షణను ఎంచుకోవచ్చు.
వారాంతాల్లో, పర్యాటక రద్దీ రోజుల్లో ఇక్కడ చోటు దొరకడం గగనం; అందువల్ల ఒక రోజు ముందే మీ స్పాట్‌ను బుక్ చేసుకుని, సమయాన్ని ఖరారు చేసుకోవడం ఉత్తమం.