కేరళ ప్రారంభ తీరప్రాంత పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోవలం (కోవళం), ప్రస్తుతం రాష్ట్రంలోని క్రియాశీల స్కూబా డైవింగ్ ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. ఈ పట్టణంలోని సురక్షితమైన సముద్ర పాయలు, స్వచ్ఛమైన జలాలు మరియు సహజ రాతి నిర్మాణాలు అటు ప్రారంభ అభ్యాసకులకు, ఇటు అనుభవజ్ఞులైన డైవర్లకు అనుకూలంగా ఉంటాయి.


సముద్ర గర్భం క్రమంగా వాలుగా సాగడం వల్ల ఇది ప్రారంభ అభ్యాసకులకు విశేషంగా అనుకూలిస్తుంది. అదే సమయంలో, లోతైన ప్రాంతాలు మరియు నీటి లోపలి రాతి నిర్మాణాలు అనుభవజ్ఞులైన డైవర్లను సైతం ఆకర్షిస్తాయి. నీటి స్వచ్ఛత బాగున్నప్పుడు లోపలి స్పష్టత పెరిగి, రంగురంగుల పగడపు దిబ్బలు, ప్యారెట్ ఫిష్ వంటి వైవిధ్యభరితమైన జలచరాలు, సీ అర్చిన్లు మరియు అప్పుడప్పుడు అరుదైన ఆక్టోపస్‌లు కనువిందు చేస్తాయి.


కోవలంలో స్కూబా డైవింగ్ స్పెషాలిటీ ఏంటంటే, అక్కడి సముద్ర గర్భ పర్యావరణం అందించే సంపూర్ణ అనుభూతి. ప్రతి డైవింగ్ ఒక విభిన్నమైన దృశ్యాన్ని అందిస్తూ, సరికొత్త అన్వేషణతో పాటు ప్రకృతితో ఒక సన్నిహిత బంధాన్ని కలిగిస్తుంది.


ఇక్కడ డైవింగ్స్ అన్నీ PADI లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గుర్తింపు ఉన్న ఆపరేటర్లు, శిక్షణ పొందిన నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఈ డైవింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు.


సంక్షిప్త సమాచారం

స్థానం మరియు ప్రవేశం

తిరువనంతపురం జిల్లాలోని కోవలం బీచ్ లో భాగమైన ఈవ్స్ బీచ్ మరియు లైట్‌హౌస్ బీచ్ ల వద్ద ఈ స్కూబా డైవింగ్ నిర్వహించబడుతుంది.

దూరాలు

కోవలం పట్టణం: 0-2 కిమీ
తిరువనంతపురం నగరం: 13 కిమీ.

త్రివేండ్రం (తిరువనంతపురం) అంతర్జాతీయ విమానాశ్రయం: 14-15 కిమీ

తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్: 13 కిమీ

బస్సు, టాక్సీ, ఆటో-రిక్షా సర్వీసులు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉన్నాయి.

పని వేళలు

ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు (సముద్ర పరిస్థితులను బట్టి)

మొత్తం వ్యవధి

బ్రీఫింగ్‌తో సహా 30–40 నిమిషాలు

నీటి అడుగున సమయం

15–25 నిమిషాలు

ముందస్తు బుకింగ్

వారాంతాలలో మరియు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో మీ స్లాట్‌ను ముందే బుక్ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

వయో పరిమితులు

10-12 ఏళ్లు

కఠినత్వ స్థాయి

ఒక మాదిరి

ఋతువు

జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే వర్షాకాలంలో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారి, అంతర్గత నీటి ప్రవాహాల ఉధృతి వల్ల డైవింగ్ చేయడం ప్రమాదకరం. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు సముద్రం ప్రశాంతంగా ఉండటం వల్ల సముద్ర గర్భంలోని అద్భుత దృశ్యాలను అన్వేషించడానికి ఇది అత్యంత అనుకూలమైన కాలం.

సుమారు ఖర్చు

మనం తీసుకునే డైవింగ్ రకాన్ని బట్టి (ట్రై డైవ్/గైడెడ్ డైవ్/లోతు) ఒక్కొక్కరికి 2,000 నుండి 4,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు.

అనుమతించబడదు

భద్రత దృష్ట్యా ప్లాస్టిక్ సీసాలను మరియు సులభంగా జారిపోయే ఆభరణాలను దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మద్యం సేవించిన తర్వాత లేదా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు డైవింగ్ చేయడం మంచిది కాదు.

నిబంధనలు

లైట్‌హౌస్ బీచ్ పరిసర ప్రాంతాలు తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలోకి వస్తున్నందున ఇక్కడ డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించబడ్డాయి.

ఛాయాచిత్రకళ మరియు మీడియా

డైవింగ్ సెంటర్స్ నడిపే ప్రతీ ఆపరేటర్ దగ్గర ప్రొఫెషనల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వారు మీకు అత్యంత నాణ్యమైన ఫోటోలను మరియు వీడియోలను అందిస్తారు.

ఎక్స్ ట్రా ఫీజు (దాదాపు 500 నుండి 1,000 రూపాయలు) ఇస్తే గోప్రో వీడియోలు, ఫోటోలు కూడా తీసి ఇస్తారు.

ప్రత్యేక అనుమతి పొందితే తప్ప, లైట్‌హౌస్ బీచ్ పరిసరాలలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు ఉంటాయి. ‍‌‍‍‌‍‌‍

ఏమి చేర్చబడ్డాయి

స్కూబా గేర్ (మాస్క్, ఫిన్స్, బిసిడి, రెగ్యులేటర్, ఆక్సిజన్ ట్యాంక్), వెట్ సూట్, సర్టిఫైడ్ ఇన్ స్ట్రక్టర్ మరియు అండర్ వాటర్ ట్రైనింగ్ సెషన్ అన్నీ ఇస్తారు.