అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

తరచుగా అడిగే ప్రశ్నలు


ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన పిల్లలు అయినా (01.09.2002 నాడు లేదా ఆ తరువాత మరియు 01.09.2014 నాడు లేదా ఆలోపు జన్మించినవారు) ఈ పోటీలో పాల్పంచుకోవచ్చు.
మీ అంతట మీరు ప్రమోటర్ వలే రిజిస్టర్ చేసుకోవచ్చు, మీ సిఫారసు చేడయం వల్ల పోటీలో ఎవరైనా పిల్లలు చేరినట్లయితే, మీ క్రెడిట్‌కు జోడించబడుతుంది మరియు గరిష్ట ఎంట్రీలను పంపిన ప్రమోటర్‌లు కేరళ సందర్శించేందుకు కాంప్లిమంటరీ టూర్ ప్యాకేజీలను కూడా పొందవచ్చు.
18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా కూడా స్వచ్చంధంగా ఈ పోటీకి ప్రమోటర్ వలే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది స్వచ్ఛందమైన పని, మరియు ప్రమోటర్‌లకు ఎలాంటి ప్రతిఫలం చెల్లించబడదు.
పాల్గొనేవారు, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్ లేదా పెయింట్ మరియు బ్రష్ లేదా స్కెచ్ పెన్నులు ఉపయోగించి పేపర్‌పై మాన్యువల్‌గా ఒక చిత్రాన్ని పెయింట్ చేయాలి. డిజిటల్, ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ టూల్స్ ద్వారా జనరేట్ చేయబడ్డ చిత్రాలు ఏవీ కూడా పోటీ కొరకు ఆమోదించబడవు. చిత్రాన్ని తరువాత ఏదైనా విధానంలో డిజిటలైజ్ చేసి, కేరళ టూరిజం పోటీ పేజీకి అప్‌లోడ్ చేయాలి. (ఫైలు సైజు 5 MB మించరాదు).
ప్రవేశదారుడు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు, అయితే అతడు/ఆమె కోరుకున్నట్లయితే గరిష్టంగా ఐదువరకు సబ్మిట్ చేయవచ్చు.
పోటీ థీమ్ కేరళ! కేరళకు సంబంధించిన ఏదైనా పెయింట్ చేయవచ్చు. మీ రిఫరెన్స్ కొరకు మేం అందమైన చిత్రాలు మరియు వీడియోలతో వీడియో మరియు ఫోటో బ్రోచర్‌లను సృష్టించాం. మీకు కావల్సిన ప్రతిదీ మీరు ఇక్కడ పొందవచ్చు.