అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

ఎలా పాల్గొనాలి


 1. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన పిల్లలు అయినా(01.09.2002 నాడు లేదా ఆ తరువాత మరియు 01.09.2014 నాడు లేదా ఆలోపు జన్మించినవారు) ఈ పోటీలో చేరవచ్చు.
 2. ఈ పెయింటింగ్ పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజు లేదు.
 3. (4-16 సంవత్సరాలు) పిల్లలకు కనుక, వారి తరఫున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు రిజిస్ట్రేషన్ ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
 4. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత, రిజిస్టర్ చేసుకున్నవారు ధృవీకరణ కొరకు ఇమెయిల్‌ని పొందుతారు.
 5. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ధృవీకరణ కోడ్ మీద క్లిక్ చేసిన తరువాత, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
 6. పెయింటింగ్ పోటీ యొక్క థీమ్ 'కేరళ'. పాల్గొనేవారు కేరళ యొక్క ఏదైనా భావనను పెయింట్ చేయవచ్చు.
 7. పెయింటింగ్ బ్రష్ మరియు పెయింట్‌తో చేతితో వేయబడింది అయి ఉండాలి. పాల్గొనేవారి వారికి నచ్చిన ఏదైనా కలర్ మెటీరియల్‌ని ఉపయోగించవచ్చు (వాటర్ కలర్, క్రేయాన్‌‌లు మొదలైనవి).
 8. పెయింటింగ్ పూర్తయిన తరువాత, సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు కేరళ టూరిజం వెబ్‌సైట్‌లో పోటీ కొరకు ఉన్న పేజీకి లాగిన్ చేయాలి మరియు మీ పెయింటింగ్ యొక్క స్కాన్ చేసిన ఇమేజ్‌ని సబ్మిట్ చేయాలి. పెయింటింగ్ ఫైలు సైజు 5 MB మించరాదు.
 9. ఎంట్రీని సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 31, జనవరి 2019.
 10. ప్రవేశదారుడు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు, అయితే అతడు/ఆమె ఒక ఎంట్రీ కంటే ఎక్కువ సబ్మిట్ చేయవచ్చు, అతడు ఆమె కోరుకున్నట్లయితే గరిష్టంగా ఐదువరకు సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఒక ప్రవేశదారుడి యొక్క అన్ని ఎంట్రీలు కూడా ఒకే లాగిన్ ఐడి కింద సబ్మిట్ చేయాలి.
 11. ఒకవేళ చట్టపరమైన సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు ఒక ప్రవేశదారుడి కంటే ఎక్కువ మందిని రిజిస్టర్ చేయాలని భావించినట్లయితే, విభిన్న ఇమెయిల్ ఐడిలతో రిజిస్టర్ చేసుకోవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే, ఒక ఇమెయిల్ ఐడితో కేవలం ఒక ప్రవేశదారుడు మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి