పోటీ గురించి

రెండు సీజన్‌లు సరదాగా, ఉత్సాహంగా సాగిన తరువాత తర్వాత పిల్లల కొరకు అంతర్జాతీయ ఆన్‌లైన్ పెయింటింగ్ పోటీ మరిన్ని బహుమతులు, ఛాలెంజ్‌లతో తిరిగి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు తమ సృజనాత్మకతను చాటిచెప్పడంతో మొదటి రెండు సీజన్‌లు ఘనవిజయం సాధించాయి. మూడో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగడానికి వాగ్ధానం చేస్తోంది. సీజన్ 3 థీమ్ 'కేరళ గ్రామీణ జీవితం', దీనికి సంబంధించిన రిఫరెన్స్ కోసం ఫొటోలు, వీడియోలను మేం వెబ్‌సైట్‌లో ఉంచాం.

ప్రపంచవ్యాప్తంగా 4 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ ఎంట్రీలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల తరఫున నమోదు చేయవచ్చు, ప్రతి పాల్గొనేవారు గరిష్టంగా ఐదు ఎంట్రీలను సమర్పించవచ్చు. అదృష్ట విజేతలు మరియు ప్రమోటర్‌లు కేరళలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఐదు రోజుల కుటుంబ పర్యటన ప్రాయోజితం చేయబడుతుంది. అంతే కాకుండా, అన్ని కేటగిరీల నుంచి బెస్ట్ ఎంట్రీలకు ఆకర్షణీయమైన బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు దేవుని స్వంత దేశంలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందండి!

Landscape Drawing