తరచుగా అడిగే ప్రశ్నలు

ఎవరు పాల్గొనగలరు?

ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన పిల్లలు అయినా (01.01.2007 నాడు లేదా ఆ తరువాత మరియు 01.01.2019 నాడు లేదా ఆలోపు జన్మించినవారు) ఈ పోటీలో పాల్పంచుకోవచ్చు.


పెద్దవారు ఈ పోటీలో భాగం కావొచ్చా?

మీరు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు వారు అయితే, మీరు ప్రమోటర్‌గా నమోదు చేసుకోవచ్చు. మీ సిఫార్సు ఆధారంగా పోటీలో చేరే ఏ పిల్లవాడు అయినా మీ క్రెడిట్‌కు జోడించబడతారు, గరిష్ట ఎంట్రీలను ప్రోత్సహించే ప్రమోటర్‌లు కేరళను సందర్శించడానికి కాంప్లిమెంటరీ టూర్ ప్యాకేజీలను పొందుతారు.


ప్రమోటర్ అంటే ఏవరు?

18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా కూడా స్వచ్చంధంగా ఈ పోటీకి ప్రమోటర్ వలే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది స్వచ్ఛందమైన పని, మరియు ప్రమోటర్‌లకు ఎలాంటి ప్రతిఫలం చెల్లించబడదు.

ఈ పోటీలో పాల్గొనడానికి ఏదైనా ఫీజు ఉన్నదా?

లేదు, ఈ పోటీకి ఎంట్రీ ఉచితం!


సబ్మిట్ చేసే ఫార్మెట్ ఏమిటి?

పాల్గొనేవారు, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్ లేదా పెయింట్ మరియు బ్రష్ లేదా స్కెచ్ పెన్నులు ఉపయోగించి పేపర్‌పై మాన్యువల్‌గా ఒక చిత్రాన్ని పెయింట్ చేయాలి. డిజిటల్, ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ టూల్స్ ద్వారా జనరేట్ చేయబడ్డ చిత్రాలు ఏవీ కూడా పోటీ కొరకు ఆమోదించబడవు. చిత్రాన్ని తరువాత ఏదైనా విధానంలో డిజిటలైజ్ చేసి, కేరళ టూరిజం పోటీ పేజీకి అప్‌లోడ్ చేయాలి. (ఫైలు సైజు 5 MB మించరాదు). చిత్ర కొలతలు కనిష్ట A4 పరిమాణంలో ఉండాలి.


ఎంట్రీల సంఖ్యపై ఏమైనా పరిమితి ఉన్నదా?

ప్రవేశదారుడు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు, అయితే అతడు/ఆమె కోరుకున్నట్లయితే గరిష్టంగా ఐదువరకు సబ్మిట్ చేయవచ్చు.


ఏమి గీయాలి? పోటీ కొరకు ఏదైనా ప్రత్యేక థీమ్ ఉన్నదా?

పోటీల కొరకు థీమ్ కేరళ గ్రామీణ జీవితం! ఈ పెయింటింగ్ కేరళలోని గ్రామాలకు సంబంధించినది కావచ్చు. మీ రిఫరెన్స్ కోసం, మేం అందమైన చిత్రాలు మరియు వీడియోలతో ఒక వెబ్‌పేజీ, వీడియోలు మరియు ఇ- బ్రోచర్‌లను సృష్టించాం. మీకు అవసరమైన అన్నీ ఇక్కడ లభిస్తాయి.

Landscape Drawing