Trade Media
     

హౌస్ బోట్


కేరళలో హౌస్‌బోట్లలో ప్రయాణించడం!

కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్‌ బోట్లలో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా?  ఒకవేళ ఇప్పటి వరకు మీరు ప్రయాణించకపోయినట్లయితే, తక్షణం ఆ దిశగా ఆలోచించండి, ఇది తప్పకుండా మీకు ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది.

ప్రస్తుతం ఉపయోగించే హౌస్‌ బోట్లు ఎంతో పెద్దవి మరియు ఇవి నెమ్మదిగా ప్రయాణిస్తూ, విహార యాత్రల కోసం ఉద్దేశించబడినవి, వాస్తవానికి ఇవి పునరుద్ధరించబడ్డ ఒకప్పటి కెట్టువల్లంలు. ఒకప్పుడు కెట్టువల్లాలను బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లడం కోసం ఉపయోగించేవారు. ఒక కెట్టువల్లం కుట్టనాడు నుంచి కొచ్చి పోర్టుకు 30 టన్నుల వరకు బరువును తీసుకెళుతుంది.

కెట్టువల్లంలు కొబ్బరితాళ్లలో కడతారు,  బోటును తయారు చేసేటప్పుడు ఒక్క మేకుకూడా వినియోగించరు. జాక్‌ వుడ్‌తో తయారు చేయబడ్డ చెక్కల్ని తాళ్లతో కట్టబడతాయి. తరువాత జీడి టెంకలను ఉడికించడం ద్వారా తయారు చేయబడ్డ బ్లాక్‌ రెసిన్‌ను దీనిపై పూస్తారు. జాగ్రత్తగా మెయింటెన్ చేయడం ద్వారా కెట్టువల్లం అనేక తరాల పాటు ఉంటుంది.

కెట్టువల్లంలో ఒక భాగం వెదురు మరియు కొబ్బరి పీచుతో కప్పబడుతుంది మరియు ఇది సిబ్బందికి రెస్ట్‌ రూమ్‌ మరియు కిచెన్‌లా ఉపయోగపడుతుంది.  పడవపైనే ఆహారాన్ని వండుతారు మరియు అద్భుతంగా బ్యాక్‌ వాటర్లలో లభించే చేపల్ని పట్టి దానితో వంటకాలు తయారు చేసి, ప్రయాణీకులకు అందిస్తారు.

ఇప్పుడు ఆధునిక ట్రక్కులు వీటిని రీప్లేస్‌ చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ 100 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న బోట్లు కూడా మార్కెట్లో ఉన్నాయి.  ప్రయాణీకులకు వసతిని నిర్మించడం ద్వారా ఇవి యాత్రీకులకు గొప్ప ఆనందాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడు బ్యాక్‌ వాటర్స్‌ లో వీటిని విశేషంగా మనం గమనించవచ్చు.ఒక్క అలప్పురాలోనే దాదాపుగా 500 హౌస్‌బోట్లు ఉన్నాయి.

కెట్టువల్లంను హౌస్‌బోట్లగా మార్చేటప్పుడు ఎన్నో జాగ్రత్త తీసుకోబడతాయి. ఇందులో కేవలం సహజ ఉత్పత్తులు మాత్రమే వినియోగిస్తారు.  వెదురు చాపలు, కర్రలు అదేవిధంగా వక్క చెట్ల యొక్క కలపను రూఫింగ్‌ కొరకు వినియోగిస్తారు పీచు చాపలు మరియు చెక్క బద్దలను ఫ్లోరింగ్‌ కోసం ఉపయోగిస్తారు. ఇక బెడ్‌ల కోసం కొబ్బరి కలప మరియు పీచును వినియోగిస్తారు. కాంతి కోసం, సోలార్‌ ప్యానెల్స్‌ వినియోగించబడతాయి.   

ఇవాళ,హౌస్‌ బోట్స్‌లో మంచి హోటల్స్‌ లో ఉండే ఫర్నిష్డ్‌బెడ్‌ రూమ్‌లు, మోడ్రన్‌ ట్రాయిలెట్లు, కోజీ లివింగ్‌ రూమ్‌లు కిచెన్‌ మరియు ఇంకా బాల్కనీలుంటాయి.  చెక్క వంపుతో చేయబడ్డ కప్పులు లేదా తాటి ఆకులు కప్పబడ్డ షేడ్లు, నిరంతరాయంగా చూడానికి అవకాశం కల్పిస్తాయి. సాధారణంగా చాలా బోట్లకు స్థానికంగా ఉండే పడవవాళ్లు తెడ్లు వేస్తారు,కొన్ని 40 హెచ్‌పి ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. బోటు ట్రైయిన్లు: ఎక్కువ మంది సందర్శకులు ఉన్న సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ హౌస్ బోట్లను జతచేస్తారు.

హౌస్‌బోటు ప్రయాణంలో మీ మదిని దోచుకునేది ఏమిటంటే, ఎవ్వరూ సృజించని గ్రామీణ కేరళావని మీ కళ్లముందు సాక్షాత్కారం అవుతుంది. ఇక మది నిండుగా మరపురాని భావనల్ని అందిస్తుంది. ఇప్పుడు, దీనికి మించి ఇంకా ఏమైనా కావాలా?

కేరళ టూరిజం ద్వారా వర్గీకరించబడ్డ హౌస్ బోట్‌ ఆపరేటర్ల జాబితా నుంచి హౌస్‌ కీపింగ్‌ ఆపరేటర్‌ను ఎంచుకోవడం కోసం దయచేసి ఇక్కడ క్లిక్‌ చేయండి.


 

Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia