కేరళలో హౌస్‌బోట్లలో ప్రయాణించడం

 
Houseboat

కేరళ బ్యాక్‌వాటర్స్‌లోని హౌస్ బోట్ ద్వారా మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? ఒకవేళ లేనట్లయితే, తప్పక చేయండి. మా రాష్ట్రం అందించే అత్యంత అసాధారణమైన మరియు ప్రత్యేకమైన అనుభవాల్లో ఇది ఒకటి.

నేడు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు సరుకు రవాణా కొరకు ఉపయోగించినవి నేడు, ప్రయాణకుల విహార యాత్రలకు ఉపయోగించబడుతున్నవి, నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఉపయోగిస్తున్న కెట్టువల్లమ్‌లు పాతవాటికి మార్పుచేర్పులు చేయబడినది. వాస్తవానికి కెట్టువల్లమ్‌లను టన్నుల కొలదీ బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. ఒక స్టాండర్డ్ కెట్టువల్లమ్‌ ద్వారా కుట్టనాడు నుంచి కొచ్చి ఫోర్టుకు 30 టన్నుల సరుకులను రవాణా చేస్తారు.

మలయాళంలో కెట్టు అనగా ‘వస్తువుల సముదాయం’ మరియు ‘వల్లమ్‌’ అంటే బోటు అని అర్థం. చెక్క బొంగులపై తాటాకు కప్పు ఉన్నపడవులు ఇవి. కొబ్బరిపీచుతో జతచేయబడ్డ జాక్ కలపతో బద్దలతో పడవ తయారు చేయబడుతుంది. తరువాత దీనికి జీడిగింజలను ఉడకించడం ద్వారా తయారుచేయబడ్డ కాస్టిక్ బ్లాక్ రెజిన్‌తో కోటింగ్ వేస్తారు. జాగ్రత్తగా ఉఫయోగించినట్లయితే, కెట్టువల్లంను అనేక తరాల పాటు ఉపయోగించవచ్చు.

కెట్టువల్లంలో కొంతభాగంగా రెస్ట్‌రూమ్ మరియు క్రూకు కిచెన్ మొదలైన వాటి కొరకు వెదురు మరియు పీచుతో తయారు చేయబడుతుంది. పడవపైనే ఆహారం తయారు చేయబడుతుంది దీనికి అనుబంధంగా బ్యాక్‌వాటర్స్ నుంచి తాజాగా వేటాడిన చేపల అందించబతుంది.

ఈ రవాణా వ్యవస్థల్లో ఆదునిక ట్రక్కుల వచ్చిన తరువాత, మార్కెట్‌ల్లో 100 సంవత్సరాల పైచిలుకు నుంచి ఉన్న ఈబోట్‌లను సరికొత్తరూపాన్ని ఇచ్చేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. ప్రయాణీకుల కొరకు ప్రత్యేక రూమ్‌లను నిర్మించడం ద్వారా, ఈ బోట్‌లు, ఒకప్పుడు పూర్తిగా అంతరించే పోయే దశ నుంచి ఇంతటి ప్రజాదరణను పొందుతున్నాయి.

నేడు బ్యాక్‌వాటర్స్‌పై ఇది ఒక ప్రసిద్ధి చెందిన విహారం మరియు అలప్పురలోనే సుమారు 500లకు పైగా హౌస్ బోట్‌లున్నాయి.

కెట్టువల్లంను హౌస్ బోట్‌లుగా మార్చేటప్పుడు సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి. కప్పు వేయడానికి వెదురు చాపలు, పుల్లలు మరియు పోక చెక్క కలపను ఉపయోగిస్తారు, పీచు పరులు మరియు చెక్క బద్ధలను మరియు కొబ్టరిచెట్ల యొక్క కలపను ఫ్లోరింగ్ వేయడానికి మరియు పీచును బెడ్‌ల కొరకు ఉపయోగిస్తారు. ఇప్పుడు లైటింగ్ కొరకు సోలార్ ప్యానల్స్ ఉపయోగిస్తారు.

ఇప్పుడు హౌస్‌బోట్లలో అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి. హోటళ్ల తరహాలో ఫర్నిష్డ్‌ బెడ్‌రూమ్‌లు,మోడ్రన్‌ టాయిలెట్లు, కోజీ లివింగ్‌ రూమ్‌లు, కిచెన్‌ మరియు బాల్కనీలుకూడా ఉంటాయి. కలప యొక్క వంకర తిరిగి కప్పు లేదా తాటాకులతో వేయబడ్డ పందిరి వంటివి నీడను అందించడంతోపాటుగా అంతరాయం లేని వీక్షణకు అవకాశం కల్పిస్తుంది. చాలావరకు బోట్‌లను స్థానికంగా ఉండే తెరచాపగాళ్లతో నడిపించబడతాయి, అయితే కొన్నింటికి 40 హెచ్‌పి ఇంజిన్ ఉంటుంది. పెద్ద గ్రూపుకు వచ్చే సందర్శకుల కొరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హౌస్ బోట్‌లు జతచేయబడ్డ బోట్ ట్రైన్‌లు కూడా ఉపయోగిస్తుంటారు.జ

ఒక ఇంటి బోట్ రైడ్ గురించి నిజంగా అద్భుతంగా చెప్పాలంటే, మీరు విశ్రాంతిగా   కేరళలో మరో విధంగా చూడలేని గ్రామీణ కేరళ యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూడటానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది.

హౌస్‌బోట్‌లు

హౌస్ బోట్లు తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పురా, ఎర్నాకుళం, త్రిసూర్ మరియు కాసర్‌గోడ్‌లో లభిస్తాయి. మరింత సమాచారం కొరకు డిటిపిసిలను సంప్రదించండి.

డిటిపిసి హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్

హౌస్ బోట్ల బుకింగ్ కొరకు, ప్రయాణీకులు జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (డిటిపిసి) ద్వారా నిర్వహించబడే హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్ ‘ట్రస్టెడ్ సర్వీసె, ట్రస్టెడ్ రేట్’ని ఉపయోగించుకోవచ్చు.

సంప్రదించు వివరాలు

అలప్పుర- హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్ మొబైల్: +91 9400051796, +91 9447483308 టెలి: +91 477 2251796, +91 477 2253308 డిటిపిసి అకౌంట్‌కు రూ. 2500 ట్రాన్స్‌ఫర్ చేసి dtpcalpy@yahoo.comకు ఇమెయిల్ పంపడం ద్వారా టూరిస్ట్‌లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. డిటిపిసి అకౌంట్ నెంబరు 10150100253203, ఫెడరల్ బ్యాంక్, ముల్లకల్ బ్రాంచ్, అలప్పుర. బ్యాంక్ కోడ్ FDRL 0001015.
District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.

×
This wesbite is also available in English language. Visit Close