కేరళ స్మృతి చిహ్నాలు
స్మృతి చిహ్నాలు ఒకరి జీవితంలోని అనుభవాలను ఆస్వాదిస్తాయి. ఈ అనుభవాలు ఏమైనా కావొచ్చు. ప్రయాణానికి వచ్చే సరికి, స్మృతి చిహ్నాలకు గణనీయమైన విలువను కలిగి ఉంటాయి, మరిముఖ్యంగా కేరళ వంటి నిజ ఆస్వాదన ప్రాంతాలను సందర్శించినప్పుడు వీటి విలువ వెలకట్టలేనిది.
కేరళలో, యాత్రికులు, కేరళ సంస్కృతి, చరిత్ర, ఆర్ట్ మరియు సామాజిక మత దృకోణాలను ప్రతిబింబించే వివిధ రకాల స్మారక చిహ్నాలను చూడవచ్చు. కేరళ స్మృతి చిహ్నాలు సంప్రదాయం మరియు సంస్కృతికి పెట్టింది పరు. రాష్ట్రంలో ఎన్నో అపురూపమైన హస్తకళలు, బంగారు ఆభరణాలు, మరియు సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. కేరళ హస్తకళలు దాని యొక్క ప్రత్యేక శైలి, ఖచ్చితత్త్వం మరియు డిజైన్ అందానికి పెట్టింది పేరు.
కేరళ స్మృతి చిహ్నాల్లో ఆకర్షణీయమైన మరియు ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన విస్త్రత శ్రేణిని గమనించవచ్చు. వీటిలో ఆరముల కన్నాడి(లోహపు దర్పణం), కొబ్బరి చిప్పలు, కలప, మట్టి మరియు కేనుతో తయారు చేసిన ఉత్పత్తులు, మురల్ పేయింటింగులు మరియు కసవు చీరలాంటి( బంగారు బుట్టా వేసిన పట్టు)చేనేత ఉత్పత్తులు వీటిలో ప్రముఖమైనవి.
కేరళలో, కేరళ కళాఖండాలను ప్రమోట్ చేయడం కొరకు కేరళ గవర్నమెంట్,డిపార్ట్ మెంట్ ఆఫ్ టూరిజం యొక్క అధికారిక ఏజెన్సీ కల్చర్ షోప్పి నుంచి యాత్రికులు వివిధ రకాలైన కేరళ స్మృతి చిహ్నాలను కొనుగోలు చేయవచ్చు. కల్చర్ షోప్పిలో, సందర్శకులు ఉరులి (వోక్), పరా (కంచుతో చేసిన సంప్రదాయ కొలతల పాత్ర), కెట్టువల్లం ( రైస్ బార్జి), ఆరముల కన్నాడి (లోహపు అద్దం), నెట్టిపట్టం (ఏనుగులకు అలంకరించేది), నెట్టూర పట్టి (సంప్రదాయ ఆభరణాల పెట్టె) మరియు ఇంకా ఎన్నింటినో కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.