బీచ్‌లు, అద్భుతమైన వైల్డ్ లైఫ్, హిల్ స్టేషన్‌లు మరియు బ్యాక్ వాటర్‌లు వంటి వాటిని ఏ మాధ్యమం రూపంలోనైనా షూటింగ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. యాడ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు లేదా ఇంకా ఫీచర్ ఫిల్మ్‌లు సైతం కేరళలోని అందమైన ప్రదేశాల ద్వారా ఎంతో లాభాన్ని పొందవచ్చు. సినిమా యొక్క సహజ సౌందర్యం మీద చిత్ర నిర్మాతలు రావడమే కాక, దేవుని స్వంత దేశంలోని మహిమల్లో పాలుపంచుకునేందుకు మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
కేరళ గురించి వర్ణించేటప్పుడు అతిశయోక్తులు మరియు ఇతర వర్ణాలు ఉపయోగించకుండా నియంత్రించుకోవడం చాలా కష్టం. ఈ రాష్ట్రంలోని అందం మరియు వైవిధ్యం నిజంగా అద్భుతం- ఈ బీచ్‌లు మరియు బ్యాక్ వాటర్‌లు, హిల్ స్టేషన్‌లు మరియు అడవులకు కేరళ పర్యాయపదంగా నిలవడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే నిశితంగా గమనించే కంటికి ఇంకా చాలా కనిపిస్తాయి. ఈ గడ్డపై ఉండే ప్రతి అంగం కూడా అది క్యాన్వాస్‌పై చిత్రీకరించబడిందా, పేపర్ లేదా స్క్రీన్ మీద చిత్రీకరించబడిందా అనే దానితో సంబంధం లేకుండా అందాలను ఒలకబోస్తుంటుంది. బాంబే, దిల్‌సే, మిస్టర్స్ ఆఫ్ స్పీసెస్, నిశ్శబ్ధ్ మరియు ఇంకా ఎన్నో చిత్రాలు దీనికి ఉదాహరణగా నిలుస్తాయి.
ప్రపంచంలోని పది స్వరాల్లో ఒకటి- నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్
బీచ్‌లు, బ్యాక్ వాటర్‌లు, హిల్ స్టేషన్, వన్య సంరక్షణ కేంద్రాలు ఇంకా ఎన్నో.
గ్రామీణ నేపథ్యంలో మసాలా ప్లాంటేషన్ మరియు వరి పొలాలతో భాసిల్లుతుంటుంది.
రామ్ గోపాల్ వర్మ్ యొక్క నిశ్శబ్ధ్ చిత్రం చాలావరకు మున్నార్‌లోనే షూటింగ్ చేశారు.
కేరళ సహజ సౌందర్యం అరుదైన దృశ్య సంస్కృతిని ఈ గడ్డకు అందించింది, ఇది గొప్ప కళాత్మక వారసత్వాన్ని పెంపొందించింది. మీరు ఇక్కడ కేవలం మ్యూజియంలు మరియు గ్యాలరీలు మాత్రమే కాకుండా ఇళ్లు, వీధులు, అలానే కోట ప్రాంగణాలు మరియు గోడల్లో సైతం ఈ కళరూపాలను మీరు చూడవచ్చు. కథాకళి నుండి కలరిపాయట్టు వరకు, పంచవతియం నుండి పూరం వరకు ఈ దృశ్య సంస్కృతి కళా రూపాలు ఉత్సాహపూరితమైన ప్రదర్శనల ద్వారా ఇంకా పరిరక్షించబడుతోంది. వాటి యొక్క గొప్పతనం, ఒక దృశ్యానికి ప్రాణాన్ని మరియు రంగుల్ని అద్దుతాయి, వాటి యొక్క సౌందర్యం స్క్రీన్ మీద అనేకవిధాలుగా స్ఫూర్తిదాయకతను కనపరుస్తుంది.
అత్యుత్తమంగా నిర్వచించబడ్డ దృశ్య సంస్కృతి
ఘనమైన సంస్కృతి మరియు కళాసంపద
కళారూపాలు మరియు పండుగల యొక్క విస్త్రృత సంగ్రహాలయం
మణిరత్నం దిల్‌సే చిత్రం తేక్కడి మరియు మున్నార్‌లో చిత్రీకరించారు.
కేరళ స్ఫూర్తిని కలిగిస్తుంది. బ్యాక్‌వాటర్‌లు, బీచ్‌లు లేదా హిల్స్ స్టేషన్‌లతో మాత్రమే కాకుండా, పచ్చటి వరి పొలాలు మరియు సుగంధ ద్రవ్యాల తోటలు, రుతుపవన కాలంలో నిశ్శబ్ధంగా ఉండే పట్టణాలు, వీధులు ప్రతి కిలోమీటరు భూమిలో ఒక కొత్త సొబగులను ఆవిష్కరిస్తాయి. కేరళలో, ఇవి సజీవనమైన అస్థిత్వాలు, ఇది ఈ భూమి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక వైభవంలో ఒక అంతర్గత భాగం. వందల స్టోరీలైన్‌లు మరియు సెల్యూలాడయిడ్ కలలు ఆవిష్కరించడానికి నీల నది ( భరతపుళా నది) ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. కళలు, మరిముఖ్యంగా సినిమారంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన అనేకమంది స్త్రీపురుషులు కేరళలో ఎదగడానికి ఇదే కారణంగా చెప్పవచ్చు.
నిజంగా స్పూర్తిని కలిగించే వాతావరణం
అత్యధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులు
ఫిల్మ్‌మేకింగ్‌లో ఘన వారసత్వం
గురిందర్ చద్దా యొక్క మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ పాక్షికంగా మున్నారులో చిత్రీకరించబడింది.
సంస్కృతుల యొక్క ప్రత్యేక సమ్మిళితంతో, కేరళలో బ్రిటిష్, చైనీస్, పోర్చుగీస్, డచ్ మరియు తన యొక్క వైవిధ్యభరమైన ఆర్కిటెక్చర్ శైలులు శతాబ్దాల తరబడి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఎర్నాకుళంలోని ఫోర్ట్ కొచ్చి, మర్చంట్ ఐవర్ ప్రొడక్షన్స్ యొక్క చారిత్రిక చిత్రం, కాటన్ మేరీ కొరకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ని అందిస్తుంది, ఇది మిమ్మల్ని అనేక శతాబ్దాల వెనక్కి తీసుకెళుతుంది. ఆర్కిటెక్చర్‌తోపాటుగా, ప్రకృతి సైతం తన వంతు భాగాన్ని అందిస్తుంది. ఉదాహరణకు మున్నార్‌లో స్కాట్‌లాండ్‌లో ఉండే శోభ, అలప్పురా యొక్క బ్యాక్‌వాటర్ బ్యూటీ వెన్నిస్‌ని తలపించగా, అథిరపల్లి యొక్క జలపాతాలు నయగారాను తలపిస్తాయి. ఈ వైవిధ్యత పిల్మ్‌మేకర్‌లు తన కాన్సెప్ట్‌ని పూర్తి సాధికారంగా రూపొందించడానికి దోహదపడుతుంది.
చూడటం మరియు అనుభూతి చెందడంలో వైవిధ్యత
స్టైల్ మరియు క్యారెక్టర్‌లో లొకేషన్‌ల ప్రత్యేకత
విభిన్న స్టైల్స్ మరియు కాలాలకు ప్రాతినిధ్యం వహించే ఆర్టిటెక్చర్‌ని కలిగి ఉంది.
ఫోర్ట్ కొచ్చి ఇస్మాల్ మర్చంట్ యొక్క కాటన్ మేరీకి సరైన యాంబియెన్స్ అందించింది.
కేరళలోని షూటింగ్ లొకేషన్‌లకు సంబంధించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ప్రతి ప్రధాన కేంద్రాలు కూడా ఒకటి నుంచి మరోదానికి చేరుకోవడానికి కేవలం ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే పడుతుంది. విస్త్రృతమైన రోడ్లు మరియు రైలు నెట్‌వర్క్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంతో తేలికగా వెళ్లవచ్చు. ఆహ్లాకరమైన వాతావరణం ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఉండే వర్షాకాలం మినహా సంవత్సరం పొడవునా కేరళ తాజా గాలి మరియు సూర్యకాంతిని అందిస్తుంది. షూట్ చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం తొమ్మిది నెలలపాటు ఉంటుందని చెప్పవచ్చు. ఇది అనుకూలమైన అంశంగా చెప్పవచ్చు.
ఒకటిదానికొటి మరింత దగ్గరగా ఉండే అద్భుతమైన ప్రదేశాలు
తేలికగా రవాణా
ఆహ్లాదకరమైన వాతావరణం
మణిరత్నం యొక్క బాంబేలో పాట సీక్వెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో చరిత్రాత్మక బీకల్ కనిపిస్తుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.